logo

300 చెక్‌డ్యాంల నిర్మాణానికి పచ్చజెండా

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 300 చెక్‌డ్యాంలు, వంతెనలు నిర్మించాలని సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం రూ.413.81 కోట్లు అంచనా వ్యయాన్ని నిర్ణయించింది.

Published : 10 Aug 2022 03:43 IST


రాయగడ జిల్లాలో కెందుగూడ వద్ద డ్యాం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 300 చెక్‌డ్యాంలు, వంతెనలు నిర్మించాలని సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం రూ.413.81 కోట్లు అంచనా వ్యయాన్ని నిర్ణయించింది. ఈ మేరకు వీసీ ద్వారా సోమవారం జరిగిన అత్యున్నత సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్‌ చంద్ర మహాపాత్ర్‌.. పనులు, గ్రామీణాభివృద్ధి శాఖలకు దిశానిర్దేశం చేశారు. వీటి నిర్మాణం వల్ల నదీ తలాల్లో (రివర్‌ బెడ్స్‌) ఉపరితల నీటి స్థాయి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భూగర్భ జలాల మెరుగుకు, పర్యావరణ, జీవావరణ పునర్వవస్థీకరణకు ఇది ఎంతగానో దోహదపడునుందని మహాపాత్ర్‌ పేర్కొన్నారు. తక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందే ఈ చెక్‌డ్యాంల వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరనున్నట్లు చెప్పిన ఆయన నదికి ఇరువైపులా కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగుకి ఉపయోగపడుతుందన్నారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం సైతం నీటిని వినియోగించుకోవచ్చన్నారు.

45 డ్యాంలు పూర్తి
రాష్ట్రంలో ఈ తరహా 45 కట్టడాలు మూడు నెలల్లో పూర్తి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో ప్రజా పనుల శాఖ 30 నిర్మాణాలను పూర్తి చేయగా గ్రామీణాభివృద్ధిశాఖ మిగతా 15 కట్టడాలను నిర్మించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చెక్‌డ్యాంల నిర్మాణానికి అనువుగా ఉన్న మరో 480 వంతెనలను గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన చోట్ల నది లేదా వాగుకి ఇరువైపులా ఉన్న పొలాల్లో కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసుకునేలా రైతులకు ప్రోత్సహించాలని ఉద్యాన, నీటి వనరుల శాఖలకు మహాపాత్ర్‌ దిశానిర్దేశం చేశారు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని