logo

బండి తీయాలంటే.. భయం భయం

రాజాం-పాలకొండ రహదారి పేరు చెబితేనే చోదకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లాలో రెండు నియోజకవర్గాలకు, అటు ఒడిశాకు వెళ్లే ఈ ప్రధాన రహదారి భారీ గుంతలతో దర్శనమిస్తోంది.

Published : 10 Aug 2022 03:43 IST


పాలకొండ కూడలి సమీపంలో అడుగుకో గుంత

రాజాం-పాలకొండ రహదారి పేరు చెబితేనే చోదకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లాలో రెండు నియోజకవర్గాలకు, అటు ఒడిశాకు వెళ్లే ఈ ప్రధాన రహదారి భారీ గుంతలతో దర్శనమిస్తోంది. ప్రస్తుత వర్షాలకు గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాలు నడపలేక చోదకులు ఆపసోపాలు పడుతున్నారు. రహదారుల అభివృద్ధికి న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. పాలకొండ కూడలి, సీతారామథియేటర్‌, డోలపేట ప్రాంతాల్లో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. నిత్యం ఇటుగా వేలాది వాహనాలు వెళుతుంటాయి. దీంతో నిత్యం అవస్థలు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ జేఈ నాగభూషణరావును వివరణ కోరగా ఎన్‌డీబీ నిధులతో పనులు చేపడతామని,  ఇప్పటికే  రూ.20 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు.


సీతారామ థియేటర్‌ వద్ద చెరువులా ఇలా..

- న్యూస్‌టుడే, రాజాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు