logo

12 కి.మీ. నడక... పింఛను అందక

వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి 12 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చిన వృద్ధ జంట సాంకేతిక లోపంతో పింఛను అందుకునే అవకాశం లేక నిరాశగా వెనుతిరిగారు. వివరాల్లోకి వేళ్తే చందహండి సమితి జమదర్‌పాడు పంచాయతీ

Published : 12 Aug 2022 01:37 IST

బ్యాంకు వద్ద వృద్ధ జంట

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి 12 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చిన వృద్ధ జంట సాంకేతిక లోపంతో పింఛను అందుకునే అవకాశం లేక నిరాశగా వెనుతిరిగారు. వివరాల్లోకి వేళ్తే చందహండి సమితి జమదర్‌పాడు పంచాయతీ కొండియాడ గ్రామానికి చెందిన మదన్‌ మాఝి(75), పవిత్ర మాఝి(70) పింఛను అందుకోవడానికి మూడు రోజులుగా చందహండిలోని ఉత్కల్‌ బ్యాంకుకు వస్తున్నారు. పలు సమస్యలతో పింఛను అందకపోగా బ్యాంకు వరకు వచ్చేందుకు రూ.300 ఖర్చు అయింది. దాంతో గురువారం కాలినడకన వచ్చినా సర్వర్‌ డౌన్‌ కావడంతో నాలుగోసారి నిరాశే ఎదురైంది. ఈ విషయమై చందహండి సామాజిక భద్రతా అధికారి ప్రకాష్‌ చంద్రను ప్రశ్నించగా పింఛను ఇంటి వద్దే ఇచ్చేలా బ్యాంకుల్లో ఏజెంట్లను నియమించామన్నారు. లబ్ధిదారులకు త్వరలోనే అందే ఏర్పాట్లు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని