logo

సైబర్‌ నిందితుని అరెస్టు

హనీట్రాప్‌తో యువకుల నుంచి లక్షల రూపాయలు మోసగించిన ఆరోపణలపై బాలేశ్వర్‌ సైబర్‌ పోలీసులు గురువారం నైజీరియాకు చెందిన శాంసన్‌ యెమీకె యేలిక అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గురువారం సైబర్‌ ఠాణా అధికారిణి మీనా

Published : 12 Aug 2022 01:37 IST

అరెస్టయిన నైజీరియన్‌ వ్యక్తితో పోలీసులు

కటక్‌, న్యూస్‌టుడే: హనీట్రాప్‌తో యువకుల నుంచి లక్షల రూపాయలు మోసగించిన ఆరోపణలపై బాలేశ్వర్‌ సైబర్‌ పోలీసులు గురువారం నైజీరియాకు చెందిన శాంసన్‌ యెమీకె యేలిక అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గురువారం సైబర్‌ ఠాణా అధికారిణి మీనా బిందానీ అందించిన వివరాల ప్రకారం... నిందితుడు విదేశీ యువతుల ఫోటోలతో ఆన్‌లైన్‌లో నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న యువకులతో చాటింగ్‌ చేసేవాడు. ఈ నేపథ్యంలో బాలేశ్వర్‌కు చెందిన వ్యక్తితో చాటింగ్‌ చేసి స్నేహం పెంచుకున్నాడు. ఆయనకు బహుమతి ఇస్తానని చెప్పి ప్రలోభ పెట్టాడు. బంగారం బిస్కెట్లు, విలువైన వస్తువులు పంపుతున్నట్లు ఫొటోలు ఆన్‌లైన్‌లో పంపించారు. తర్వాత దిల్లీ నుంచి యువకుడికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. దిల్లీ కస్టమ్స్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నామని, ఆయనకు విలువైన బంగారం బిస్కెట్‌ లండన్‌ నుంచి ఎవరో పంపించారని, కస్టమ్స్‌ ఛార్జీలు పంపించాలని తెలిపారు. బ్యాంక్‌ ఖాతా నెంబర్‌ కూడా ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి రూ.30 లక్షలు బ్యాంకు ఖాతాలో వేశాడు. బహుమతి తన వద్దకు చేరకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టి నైజీరియా వ్యక్తిని దిల్లీలో అరెస్ట్‌ చేశారు. ఆయన వద్ద నుంచి రూ.ఆరులక్షల నగదు సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్‌, గడువు పూర్తయిన పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని