logo

కోత నివారణ, తీర రక్షణకు శాశ్వత చర్యలు

సముద్రుని అలల కోత నివారణ, తీర ప్రాంతాల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఈ దిశగా శాశ్వత చర్యలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి టుకుని సాహు చెప్పారు. బుధవారం రాత్రి లోక్‌సేవా భవన్‌లో ఏర్పాటైన

Published : 12 Aug 2022 01:37 IST

ఒప్పంద కార్యక్రమంలో మంత్రి టుకుని, అనూ, ఎన్‌ఐఓటీ అధికారులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: సముద్రుని అలల కోత నివారణ, తీర ప్రాంతాల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఈ దిశగా శాశ్వత చర్యలు చేపట్టినట్లు జలవనరులశాఖ మంత్రి టుకుని సాహు చెప్పారు. బుధవారం రాత్రి లోక్‌సేవా భవన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ, చెన్నై) సంస్థతో జల వనరులశాఖ రానున్న అయిదేళ్ల కోసం ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఎంఓయూ ప్రకారం... గంజాం, పూరీ, భద్రక్‌, బాలేశ్వర్‌, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌ తీర జిల్లాల్లో అనేక తీర ప్రాంతాలు అలల కోతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి నియంత్రణలోకి తేవడానికి ఎన్‌ఐఓటీ సమగ్ర కార్యాచరణ నివేదికలు (బ్లూ ప్రింట్‌) సిద్ధం చేస్తోంది. ఆయాచోట్ల రక్షణ గోడలు తదితర నిర్మాణాలు చేపడుతుంది. మంత్రి టుకుని విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాల మేరకు తీర ప్రాంతాల రక్షణకు జలవనరులశాఖ శాశ్వత కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. తీర రక్షణలో విశేషానుభవం కలిగిన ఎన్‌ఐఓటీతో కలిసి తీర ప్రాంతాల నిర్మాణాలను జలవనరులశాఖ చేపడుతుందన్నారు. కార్యక్రమంలో శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనుగార్గ్‌, ఎన్‌ఐఓటీ సంచాలకుడు జి.ఎ.రాందాస్‌, జలవనరులశాఖ చీఫ్‌ ఇంజినీరు బిజయ్‌కుమార్‌ మిశ్ర తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు