logo

శ్రీక్షేత్రంలో రక్షాబంధన్‌ వేడుకలు

పూరీ శ్రీక్షేత్రంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రక్షాబంధన్‌ వేడుక, అగ్రజుడు బలభద్రుని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచిన

Published : 13 Aug 2022 02:30 IST

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రక్షాబంధన్‌ వేడుక, అగ్రజుడు బలభద్రుని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచిన సేవాయత్‌లు జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ తదితర సేవలు నిర్వహించారు. 7.30 గంటలకు స్వామి గోపాలవల్లభ సేవ తర్వాత బలభద్రునికి జన్మదినం నేపథ్యంలో ప్రత్యేక అలంకరణ చేశారు. 11.30 గంటలకు పట్రా సేవాయత్‌ జగన్నాథ పాత్ర్‌ శ్రీక్షేత్రానికి 4 పెద్ద పట్టు రాఖీలు తెచ్చారు. మేకప్‌, సింగార్‌ సేవాయత్‌లకు వాటిని అందజేసిన తర్వాత వారు ముగ్గురు మూర్తుల సన్నిధిలో రాఖీలకు పూజించారు. తర్వాత సుభద్ర పేరిట ఇద్దరు సోదరులకు రెండేసి రక్షాబంధనాలు కట్టారు. తర్వాత మేరకు సుదర్శనుని ఉత్సవ విగ్రహాన్ని మార్కండేయ పుష్కరిణికి తీసుకెళ్లి అక్కడ పూజలు చేశారు. రక్షాబంధన్‌ వేడుకల నేపథ్యంలో 56 రకాల పిండి వంటకాలు నైవేద్యంగా అర్పించారు. ఈ నేపథ్యంలో అసంఖ్యాక భక్తులు ఈ వేడుకలను రోజంతా తిలకించి ఆరాధ్యదైవాలకు పూజించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని