logo

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఉదయానికిది వాయుగుండంగా మారే అవకాశం ఉందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ మధ్యాహ్నం

Published : 14 Aug 2022 04:53 IST

నేడు వాయుగుండంగా మారే అవకాశం

రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఉదయానికిది వాయుగుండంగా మారే అవకాశం ఉందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ మధ్యాహ్నం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. పీడనం ప్రభావంతో రానున్న 48 గంటల వరకు తీర ప్రాంతాల్లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రంలో అలల ఉద్ధృతి తీవ్రంగా ఉన్నందున మత్స్యకారుల చేపల వేట 15వ తేదీ వరకు నిషేధించినట్లు తెలిపారు. పీడనం వల్ల శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు

7 జిల్లాలకు రెడ్‌ హెచ్చరికలు

పూరీ, కటక్‌, జగత్సింగ్‌పూర్‌ జాజ్‌పూర్‌, కేంద్రపడ, ఢెంకనాల్‌, భద్రక్‌ జిల్లాల్లో ఆదివారం 20 సెంటీమీటర్ల వర్షం కురిసే సూచనలున్నందున రెడ్‌ హెచ్చరికలు చేసినట్లు దాస్‌ చెప్పారు. ఖుర్ధా, గంజాం, నయాగఢ్‌, గజపతి, బాలేశ్వర్‌, మయూర్‌భంజ్‌, కేంఝర్‌, అనుగుల్‌, సంబల్‌పూర్‌, సోన్‌పూర్‌, బరగఢ్‌, బౌద్ధ్‌, కొంధమాల్‌, కలహండి, రాయగడ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్‌ హెచ్చరికలు చేశారు. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు చేశామని దాస్‌ తెలిపారు.

జనజీవనం అస్తవ్యస్తం

భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో మార్కెట్లు వెలవెలబోయాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అలల ఉద్ధృతి తీవ్రంగా కనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని