logo

సీఎస్‌గా ప్రదీప్‌ ?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) పోస్టు ఎవరికి అప్పగిస్తారన్నది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ప్రస్తుత సీఎస్‌ సురేష్‌ మహాపాత్ర్‌ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తారు. ఆరు మాసాల క్రితం ఆయన పదవీ కాలం పూర్తయినా పనితీరు బాగుందని

Published : 14 Aug 2022 04:53 IST

సురేష్‌కు ఓఈఆర్‌సీ అధ్యక్ష పదవి?

సురేష్‌ మహాపాత్ర్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) పోస్టు ఎవరికి అప్పగిస్తారన్నది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ప్రస్తుత సీఎస్‌ సురేష్‌ మహాపాత్ర్‌ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తారు. ఆరు మాసాల క్రితం ఆయన పదవీ కాలం పూర్తయినా పనితీరు బాగుందని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం సర్వీసు కాలం పెంచింది. ఆయనను మరికొంత కాలం కొనసాగించే అవకాశం లేదని తెలిసింది. ఒడిశా ఎలక్ట్రికల్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఓఈఆర్‌సీ) అధ్యక్ష పదవి మూడు నెలలుగా ఖాళీగా ఉంది. సురేష్‌ ఈనెల 30న ఉద్యోగ విరమణ చేసిన వెంటనే ఓఈఆర్‌సీ అధ్యక్షునిగా నియమిస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సీఎస్‌ పదవి కోసం సీనియర్‌ ఐఏఎస్‌అధికారులు జి.వి.వి.శర్మ, రాజ్‌కుమార్‌ శర్మ, నికుంజ సుందరరాయ్‌, సి.జె.వేణుగోపాల్‌ జాబితాలో ఉన్నారు. కానీ ప్రదీప్‌కుమార్‌ జెనాకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం జెనా రాష్ట్ర అభివృద్ధి కమిషనర్‌, ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సంగతి విదితమే.

ప్రదీప్‌కుమార్‌ జెనా​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని