logo

వ్యర్థాలతో 13 అడుగుల ఎత్తయిన భారత్‌ రేఖాచిత్రం ఆవిష్కరణ

బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో సుమారు 400 కిలోల బరువు గల వ్యర్థాలతో 13 అడుగుల ఎత్తయిన భారత్‌ రేఖాచిత్రాన్ని తీర్చిదిద్దారు. ఐటీఐ ప్రవేశ మార్గం బయట రహదారి పక్కన ఏర్పాటు చేసిన దీన్ని శనివారం ఆవిష్కరించారు.

Published : 14 Aug 2022 04:53 IST

కళాఖండాన్ని ప్రారంభించిన ఆచార్య పాఠి, పక్కన రజత్‌ పాణిగ్రహి తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో సుమారు 400 కిలోల బరువు గల వ్యర్థాలతో 13 అడుగుల ఎత్తయిన భారత్‌ రేఖాచిత్రాన్ని తీర్చిదిద్దారు. ఐటీఐ ప్రవేశ మార్గం బయట రహదారి పక్కన ఏర్పాటు చేసిన దీన్ని శనివారం ఆవిష్కరించారు. ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు ఆచార్య కె.ఎం.పాఠి ముఖ్యఅతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐటీఐ ప్రధానాచార్యుడు రజత్‌కుమార్‌ పాణిగ్రహి మాట్లాడుతూ 59వ నెంబరు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ రేఖాచిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ మార్గంలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, ఈ కళాకృతి వద్ద నిల్చుని చరవాణిలో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు సెల్ఫీ పాయింట్‌గా సుందరీకరించామని వెల్లడించారు. కార్యక్రమంలో బోధనా సిబ్బంది, పలువురు విద్యార్థురులు పాల్గొన్నారు.

ఐటీఐ బయట సెల్ఫీ పాయింట్‌​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని