logo

అంతటా మువ్వన్నెల రెపరెపలు.. ఇంటింటా జెండాలు

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ‘హర్‌ ఘర్‌ తిరంగ’ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. బ్రహ్మపురలోని ప్రభుత్వ, పైవేటు విద్యాసంస్థలు, ఇతరత్రా సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఒడిశా నేవల్‌

Published : 14 Aug 2022 04:53 IST

ఎన్‌సీసీ ఆధ్వర్యంలో పతాకాలతో ర్యాలీకి జెండా ఊపుతున్న వీసీ ఆచార్య మహంతి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ‘హర్‌ ఘర్‌ తిరంగ’ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. బ్రహ్మపురలోని ప్రభుత్వ, పైవేటు విద్యాసంస్థలు, ఇతరత్రా సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఒడిశా నేవల్‌ యూనిట్‌ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఉదయం స్థానిక గాంధీనగర్‌లోని గ్రూప్‌ హెడ్‌క్వార్టర్స్‌ కార్యాలయం వద్ద పతాకాలతో ర్యాలీ ప్రారంభించారు. కళ్లికోట వర్సిటీ ఉపకులపతి (వీసీ) ఆచార్య ప్రఫుల్లకుమార్‌ మహంతి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీకి జెండా ఊపారు. భాజపా ఆధ్వర్యంలో స్థానిక అస్కా రోడ్డులో పెద్దబజారు ఠాణా ఆవరణలోని షహీదు సుశాంత గౌడ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాలతో నగరంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. భాజపా నాయకులు భృగు బక్షిపాత్ర్‌, కన్హుచరణ పతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక అంధపసర రోడ్డులోని ఓ భవంతిని మువ్వన్నెల పతాకాలతో అలంకరించారు. భవనంపై చుట్టూ సుమారు వంద అడుగుల జాతీయ పతాకాన్ని అలంకరించారు. నగరంలోని పలు బహుళ అంతస్థులు, ఇళ్ల మేడలపై ప్రజలు జాతీయ పతాకాలు ఎగురవేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ బహుముఖి సంఘం ఆధ్వర్యంలో స్థానిక కోర్టుపేట కూడలిలో 2018 నుంచి ప్రతిరోజు ఉదయం జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ, సాయంత్రం దాన్ని అనవతం చేస్తున్నారు. ఉదయం సంఘం అధ్యక్షుడు రామ్‌కుమార్‌ పాత్ర్‌ తదితరులు జెండా వందనం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు