logo

పోరాటంలో పాత్ర కీలకం.. గుర్తింపు శూన్యం

స్వాతంత్య్ర పోరాటంలో కొరాపుట్‌ జిల్లా పాత్ర కీలకం. ముఖ్యంగా నందపూర్‌ సమితిలో అత్యధికంగా 14 మంది స్వాతంత్య్ర సమరయోధులు ఉండడం విశేషం. వారికి ఎలాంటి గుర్తింపు లేకపోవడం శోచనీయం. కనీసం వారి విగ్రహాలనైనా ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా వారి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నా

Updated : 15 Aug 2022 06:14 IST

జయపురంలో ఉన్న భగవాన్‌ ఖిముడు విగ్రహం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర పోరాటంలో కొరాపుట్‌ జిల్లా పాత్ర కీలకం. ముఖ్యంగా నందపూర్‌ సమితిలో అత్యధికంగా 14 మంది స్వాతంత్య్ర సమరయోధులు ఉండడం విశేషం. వారికి ఎలాంటి గుర్తింపు లేకపోవడం శోచనీయం. కనీసం వారి విగ్రహాలనైనా ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా వారి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నా ఫలితం శూన్యం. ఒక సమరయోధుడు భగవాన్‌ ఖిముడు విగ్రహం తయారు చేయించినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కళాకారుల దగ్గరే ఉండిపోయింది.

శిలాఫలకంలో అయిదు పేర్లే..

సమితికి చెందిన సమర యోధులందరూ ఉద్యమంలో పాల్గొనడంతో బ్రిటీష్‌ ప్రభుత్వం బ్రహ్మపుర, కటక్‌, కొరాపుట్‌ తదితర కారాగారాల్లో బంధించింది. వారంతా స్వాతంత్య్రం సిద్ధించాక విడుదలయ్యారు. 14 మందికి యోధులుగా గుర్తింపు పత్రాలు, పింఛన్లు మినహా మరే గుర్తింపు లభించలేదు. వారిలో 13 మంది మృతిచెందగా జల గంగాధర్‌ ప్రస్తుతం మల్కాన్‌గిరి జిల్లాలో నివసిస్తున్నారు. యోధుల పేర్లతో సమితి కేంద్రం వద్ద శిలాఫలకం ఏర్పాటు చేయగా అందులో అయిదుగురి పేర్లు మాత్రమే ఉండడంతో మిగిలినవారి కుటుంబ సభ్యులు నిరాశకు గురయ్యారు. దేశం కోసం పోరాడిన వారికిచ్చే గౌరవం ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి గౌరవార్థం విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సమితి అభివృద్ధి అధికారి రజనీకాంత్‌ దాస్‌ వద్ద ప్రస్తావించగా 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా 14 మంది పేర్లతో కూడిన శిలాఫలకాన్ని సమితి కేంద్రం వద్ద ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహాల ఏర్పాటు తన ఆధ్వర్యంలో లేదని తోసిపుచ్చారు.

సమితి కేంద్రం వద్ద స్మృతి స్థూపం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని