logo

బీమా చెల్లించాలని రైతుల ఆందోళన

దేశమంతటా అమృత్‌ మహోత్సవాలు జరుపుతున్న వేళ మేము విష మహోత్సవం చేసుకుంటున్నామని బరగఢ్‌ జిల్లా పద్మపూర్‌ సబ్‌డివిజన్‌కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీమా చెల్లించాలని కోరుతూ ఆదివారం బరగఢ్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై ఆందోళన చేపట్టారు. గతేడాది వర్షాభావంతో పంటలు ఎండిపోయి నష్టపోయామని

Updated : 15 Aug 2022 06:13 IST

రైలు పట్టాలపై నిరసన తెలుపుతున్న అన్నదాతలు

బరగఢ్‌, న్యూస్‌టుడే: దేశమంతటా అమృత్‌ మహోత్సవాలు జరుపుతున్న వేళ మేము విష మహోత్సవం చేసుకుంటున్నామని బరగఢ్‌ జిల్లా పద్మపూర్‌ సబ్‌డివిజన్‌కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీమా చెల్లించాలని కోరుతూ ఆదివారం బరగఢ్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై ఆందోళన చేపట్టారు. గతేడాది వర్షాభావంతో పంటలు ఎండిపోయి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపినా సఫలం కాలేదని, దిక్కుతోచక ఆందోళన బాట పట్టామని ఆరోపించారు. రైతు సంఘం నేత రమేష్‌ మహాపాత్ర్‌ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు. ఆందోళన కారణంగా నాగావళి (సంబల్‌పూర్‌-నాందేడ్‌) ఎక్స్‌ప్రెస్‌, ఇంటర్‌సిటీ తదితర రైళ్లు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని