logo

సహాయక చర్యలకు నవీన్‌ ఆదేశం

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గురువారం సాయంత్రం వరద పీడిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిస్థితి అధ్యయనం చేశారు. కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌, కటక్‌, పూరీ, ఖుర్దా జిల్లాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షించిన

Published : 19 Aug 2022 03:25 IST

వరద ప్రాంతాల్లో విహంగ వీక్షణం


పూరీ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గురువారం సాయంత్రం వరద పీడిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిస్థితి అధ్యయనం చేశారు. కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌, కటక్‌, పూరీ, ఖుర్దా జిల్లాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం తీవ్రంగా ప్రభావితమైన ఈ 5 జిల్లాలకు 15 రోజులు,  సంబల్‌పూర్‌, బరగఢ్‌, బౌద్ధ్‌, సోన్‌పూర్‌, అనుగుల్‌ జిల్లాల్లో 7 రోజులు సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు బాధితులకు మంచి భోజనం, మంచినీరు అందించాలన్నారు. పశుగ్రాసానికి కొరత రానీయవద్దన్నారు. వరద పీడిత ప్రాంతాల్లో బాధితులందరికీ వైద్య పరీక్షలు చేయాలని అవసరమైన చికిత్సలు అందించాలన్నారు. వరద తగ్గిన తరువాత వారం రోజుల్లోగా కలెక్టర్లు ప్రభుత్వానికి నష్టాల వివరాలు సమర్పించాలని, తరువాత పక్షం రోజుల్లో అందరికీ సాయం అందజేస్తామన్నారు. బాధితులకు అండగా ఉంటూ సహాయం చేస్తామని సీఎం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని