logo

అనన్య’ లఘుచిత్రానికి అవార్డుల పంట

ఉత్తరాఫ్రికాలోని ట్యునిషియాలో ‘ఫెస్టివల్‌ ఇంటర్నేషనల్‌ వీడియోస్‌ సెన్సిబిలైజేషన్‌’ (ఎఫ్‌ఐవీఎస్‌) ఆధ్వర్యంలో ఇటీవల మూడు రోజులపాటు ‘ఎఫ్‌ఐవీఎస్‌ ఫెస్టివల్‌-2022’ నిర్వహించింది

Published : 19 Aug 2022 03:25 IST

‘ట్యునిషియాలో అతిథుల నుంచి అవార్డు అందుకుంటున్న కృష్ణ డీకే

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఉత్తరాఫ్రికాలోని ట్యునిషియాలో ‘ఫెస్టివల్‌ ఇంటర్నేషనల్‌ వీడియోస్‌ సెన్సిబిలైజేషన్‌’ (ఎఫ్‌ఐవీఎస్‌) ఆధ్వర్యంలో ఇటీవల మూడు రోజులపాటు ‘ఎఫ్‌ఐవీఎస్‌ ఫెస్టివల్‌-2022’ నిర్వహించింది. ఇందులో గంజాం జిల్లా హింజిలికాటుకు చెందిన ‘నృత్యం’ పరిశోధన కేంద్ర దర్శకుడు కృష్ణ డీకే (కృష్ణచంద్ర సాహు) పాల్గొని ప్రతిభను చాటారు. ఇరవైౖకిపైగా దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఇందులో పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్‌పై కృష్ణ డీకే దర్శకత్వం వహించిన ‘అనన్య’ లఘు చిత్రం ప్రదర్శించారు. దీనికి ఉత్తమ చిత్రం, ఉత్తమ సెన్సేషనల్‌ అవార్డులు దక్కాయి. ఈ నెల 15న జరిగిన ఉత్సవాల్లో అతిథులు, నిర్వాహకుల నుంచి కృష్ణ డీకే ఈ అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో ఈ ఉత్సవాల్లో పాల్గొని, అవార్డులు సాధించానని కృష్ణ డీకే బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని