logo

రూ.2.5 కోట్లకుపైగా విలువైన గంజాయి పట్టివేత

రాయగడ జిల్లా అబ్కారీ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ.2.5 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు.

Published : 19 Aug 2022 03:25 IST

స్వాధీనం చేసుకున్న సరకుతో అబ్కారీ అధికారులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా అబ్కారీ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ.2.5 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు. అబ్కారీశాఖ జిల్లా సూపరింటెండెంట్‌ అభిరామ్‌ బెహరా గురువారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమ మద్యం విక్రయాలపై దాడి చేసేందుకు వెళ్తున్న సిబ్బంది బైపాస్‌ రహదారిలో ఓ ట్రక్కు వేగంగా వెళ్లడం గుర్తించారు. అనుమానంతో దానిని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి పొట్లాలు కనిపించాయి. ఒక్కో పొట్లంలో 27 కిలోల చొప్పున మొత్తం 4,500 కిలోల గంజాయి బయటపడినట్లు బెహర చెప్పారు. సరకు లోడుతో విశాఖ నుంచి బయలుదేరిన ఈ ట్రక్కు దిల్లీకి వెళ్తున్నట్లు తెలిసిందని, దిల్లీకి చెందిన దినేష్‌కుమార్‌, చందన్‌ అనే ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని