logo

దీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులకు వీడ్కోలు

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రంలో ఉద్యోగ విరమణ చేసినవారిని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం హర్షణీయమని ప్రాజెక్టు ఎస్‌ఈ కె.వి.నాగేశ్వరరావు తెలిపారు.

Published : 25 Sep 2022 03:10 IST


ఉద్యోగ విరమణ చేసినవారితో ఎస్‌ఈ నాగేశ్వరరావు

మాచ్‌ఖండ్‌, న్యూస్‌టుడే: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రంలో ఉద్యోగ విరమణ చేసినవారిని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం హర్షణీయమని ప్రాజెక్టు ఎస్‌ఈ కె.వి.నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక స్థానిక కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్కేంద్రంలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పనిచేసిన ఎల్‌.ఎస్‌.మన్మథరావు, ఇస్రాయిల్‌భాగ్‌, భగవాన్‌ ముదిలిలు ఉద్యోగ విరమణ చేయగా అధికారులు, కార్మిక సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ (జనరేషన్‌) దుంగా రమణయ్య, కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వీరస్వామి, అధ్యక్షుడు ఎమ్‌.ఎన్‌.ఎస్‌.కామేశ్వరావు, ఏపీఈఈ యూనియన్‌ ప్రతినిధి జి.ఈశ్వరరావు, ఎంఈఈ యూనియన్‌ ప్రతినిధి ఎం.మాధవ్‌రావు, ఆసియానంద్‌ నాయక్‌, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని