logo

త్రిపుర భైరవి అవతారంలో కటక్‌ చండి

కటక్‌ నగర ప్రజల ఆరాధ్య దేవత కటక్‌ చండి. ఆదివారం త్రిపుర భైరవి అవతారంలో దర్శనమిచ్చారు. మరోవైపు కటక్‌ దివాన్‌ బజార్లో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో సోమవారం నుంచి శరన్నవరాత్రుల పూజలు నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్‌ బోర్డు కార్యదర్శి ఐ.సుబ్రహ్మణ్యం

Published : 26 Sep 2022 03:16 IST

కటక్‌, న్యూస్‌టుడే: కటక్‌ నగర ప్రజల ఆరాధ్య దేవత కటక్‌ చండి. ఆదివారం త్రిపుర భైరవి అవతారంలో దర్శనమిచ్చారు. మరోవైపు కటక్‌ దివాన్‌ బజార్లో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో సోమవారం నుంచి శరన్నవరాత్రుల పూజలు నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్‌ బోర్డు కార్యదర్శి ఐ.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ 26 నుంచి అక్టోబరు 5 వరకు శరన్నవరాత్రుల పూజలు కొనసాగుతాయని, అన్నపూర్ణా దేవి విగ్రహానికి ప్రతిరోజు వివిధ అవతారాల్లో అలంకరించి పూజలు చేస్తామని తెలిపారు.


ధవళముఖిగా శ్యామలేశ్వరీ దేవి

బరగఢ్‌, న్యూస్‌టుడే: మహాలయ అమావాస్య సందర్భంగా ఆదివారం బరగఢ్‌ జిల్లాలోని శ్యామలేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్యామలేశ్వరి దేవిని తెల్లటి వస్త్రాలు, ఆభరణాలు, పూలతో ధవళముఖి రూపంలో అలంకరించారు.  


శక్తిపీఠాల్లో పూజలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలోని శక్తిపీఠాల్లో షోడశోపచార పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని తరాతరిణి, శ్రీసిద్ధభైరవి (మంత్రీడి), మొహురి కాళువ, నారాయణి, సింఘాసిని, బ్రహ్మపుర మా బుడి శాంతాణి (పెద్దమ్మవారు) తదితర మందిరాల్లో ప్రతిరోజు విశేష అర్చనలు, హోమాలు నిర్వహిస్తున్నారు. తరాతరిణి శక్తిపీఠంలోని అమ్మవారిని చిత్రంలో చూడొచ్చు. సోమవారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానుండగా, శక్తి పీఠాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని