logo

కాలుజారి పడి విద్యార్థి మృతి

సిమిలిగుడ సమితి దొలాయిగుడ గ్రామ పంచాయతీలోని బంగురు గుడ గ్రామానికి చెందిన మారజ్‌ జాని(6) ఆశ్రమ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం సూరజ్‌ స్నానాల గదికి వెళ్లి కాలుజారి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Published : 27 Sep 2022 03:22 IST

ఉపాధ్యాయులపై చిన్నారి తండ్రి ఫిర్యాదు


సూరజ్‌ మృతదేహం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ సమితి దొలాయిగుడ గ్రామ పంచాయతీలోని బంగురు గుడ గ్రామానికి చెందిన మారజ్‌ జాని(6) ఆశ్రమ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం సూరజ్‌ స్నానాల గదికి వెళ్లి కాలుజారి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలిజేయడంతో వెంటనే కుందిలి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. అక్కడ నుంచి లక్ష్మణ్‌ నాయక్‌ వైద్య కళాశాలకు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో బ్రహ్మపురం..ఆదివారం విశాఖ పట్టణం తరలించగా పరీక్షించిన వైద్యులు బతికే అవకాశం లేదని చెప్పేశారు. సోమవారం తెల్లవారుజామున ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో సూరజ్‌ మృతి చెందాడు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని జిల్లా సంక్షేమ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న మృతదేహాన్ని సమితి అధ్యక్షురాలు లిల్లీ అంతబిరియా.. సమితి ఉపాధ్యక్షులు శివ బంగారి తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. చిన్నారి తండ్రి భాస్కర్‌ సిమిలిగుడ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పరీక్షకు తరలించారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ చనిపోయినట్లు భాస్కర్‌ ఆరోపించారు. విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థి నదిలో మునిగి చనిపోయిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని