logo

నిన్న కార్మికుడు... నేడు ఆదర్శ కర్షకుడు

లగేజీలు మోస్తూ పొట్ట నింపుకొనే కార్మికుడు కర్షకుడిగా మారి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. కౌలుకు భూమిని తీసుకుని కూరగాయాలు పండించి.. నేడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. రామన్నగుడ సమితి ఖంబాగుడ గ్రామానికి చెందిన

Published : 27 Sep 2022 03:22 IST

గిరిజన రైతు టుబులు

గుణుపురం, న్యూస్‌టుడే: లగేజీలు మోస్తూ పొట్ట నింపుకొనే కార్మికుడు కర్షకుడిగా మారి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. కౌలుకు భూమిని తీసుకుని కూరగాయాలు పండించి.. నేడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. రామన్నగుడ సమితి ఖంబాగుడ గ్రామానికి చెందిన గిరిజనుడు టుబులు కొరొకొరియా తెలిసిన రైతు వద్ద ఎకరా భూమి తీసుకుని వ్యవసాయాధికారుల సూచనలతో వంగ సాగు ప్రారంభించాడు. నాలుగేళ్లలో లాభాల బాట పట్టించాడు. ఆదాయం సంతృప్తికర స్థాయిలో రావడంతో వచ్చిన డబ్బుతో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. మొత్తం భూమిలో వంకాయలు పండిస్తున్న కొరొకొరియా రామన్నగుడ, పద్మపురం, గంజాం, రాయగడ జిల్లాలకు సరకు ఎగుమతి చేసే స్థాయి వెళ్లాడు. పది మందికి ఉపాధి కల్పించాడు. వ్యవసాయ అధికారుల సూచనలే తనను అన్నదాతగా మార్చాయని ఆనందం వ్యక్తం చేశాడు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు అవుతుందని ఆదాయం అంతకు మించి వస్తోందని సంతోషంగా చెప్పాడు. ఒకప్పుడు పూట గడవాలంటే కష్టంగా ఉండేదని నేడు కుటుంబమంతా ఆనందంగా ఉందన్నారు.

ఎగుమతికి సిద్ధం చేస్తున్న సరకు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని