logo

విలక్షణం ఆదివాసీ సంస్కృతి: నవీన్‌

ఆదివాసీల సంస్కృతి విలక్షణమైనదని, గిరిజన సంప్రదాయం, అలవాట్లు, ఆచార వ్యవహారాలు గొప్పవని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. సోమవారం భువనేశ్వర్‌లోని ఎస్టీ సంగ్రహాలయాన్ని సందర్శించిన సీఎం

Published : 27 Sep 2022 03:22 IST

ఆదివాసీల జీవన విదానం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నవీన్‌, మంత్రి సరక, బాలకృష్ణన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఆదివాసీల సంస్కృతి విలక్షణమైనదని, గిరిజన సంప్రదాయం, అలవాట్లు, ఆచార వ్యవహారాలు గొప్పవని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. సోమవారం భువనేశ్వర్‌లోని ఎస్టీ సంగ్రహాలయాన్ని సందర్శించిన సీఎం ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ట్రైబ్స్‌ ఇన్‌ ఒడిశా’ పేరుతో ముద్రించిన ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. 3,800 పేజీలతో ఉన్న ఈ పుస్తకంలో 418 అధ్యయన వ్యాసాలున్నాయి. రాష్ట్రంలోని 62 తెగల గిరిజనుల జీవన శైలి, ఇతర వివరాలతో కూడిన ఈ పుస్తకం రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ అధ్యయన శిక్షణశాఖ ముద్రించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పుస్తకంలో విలువైన సమాచారం ఉందని, ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరక, నవీన్‌ రాజకీయ సలహాదారు ఆర్‌.బాలకృష్ణన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంగ్రహాలయంలో ఆదివాసీల చిత్రాలు, ఉపకరణాలను వారంతా నవీన్‌తో కలసి తిలకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని