logo

వైభవంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం

గంజాం జిల్లాలో పండగ సందడి మొదలైంది. జిల్లావ్యాప్తంగా సోమవారం దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్ని శక్తిపీఠాల్లో విశేష అర్చనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అమ్మవార్ల మందిరాల్లో శాస్త్రోక్తంగా పూజలు,

Published : 27 Sep 2022 03:22 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలో పండగ సందడి మొదలైంది. జిల్లావ్యాప్తంగా సోమవారం దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్ని శక్తిపీఠాల్లో విశేష అర్చనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని అమ్మవార్ల మందిరాల్లో శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు ప్రారంభించారు. స్థానిక తెలుగు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నీలకంఠనగర్‌ హౌసింగు బోర్డులో గాయత్రీ మాత మందిరంలో నవరాత్ర మహోత్సవాలు ఉదయం వైభవంగా మొదలయ్యాయి. మందిరం ఆవరణలోని వేద భవనంలో మహామేరు శ్రీచక్ర యంత్రరాజం, గాయత్రీమాత, వినాయక ఉత్సవ మూర్తులకు భక్తులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఇదే ఆవరణలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, ఖస్పావీధిలో జఠాధరేశ్వరస్వామి మందిర ఆవరణలోని సంతోషిమాత మందిరంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపంలో ఉదయం 110 మంది మహిళలు, యువతులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక మార్తాపేటలోని రామలింగ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉదయం శాస్త్రోక్తంగా శరన్నవరాత్రోత్సవాలు మొదలయ్యాయి. తల్లిని దివ్యంగా అలంకరించి విశేష పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగరంలోని ఇతర మందిరాల్లోనూ సామూహిక కుంకుమార్చనలు తదితరాలు నిర్వహించారు.

జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపం ఆవరణలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్న మహిళలు, యువతులు

గాయత్రీ మందిరం ఆవరణలోని వేద భవనంలో శ్రీచక్రానికి అభిషేకాలు చేస్తున్న భక్తులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు