logo

బీమా మొత్తం ఇవ్వకుంటే సామూహిక ఆత్మహత్యలే

బొలంగీర్‌ జిల్లాలో నష్టపోయిన రైతులకు వ్యవసాయ బీమా మొత్తాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పలు ప్రాంతాల్లో రైలురోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బొలంగీర్‌ రైల్వే స్టేషన్‌,

Published : 27 Sep 2022 03:22 IST

బొలంగీర్‌ జిల్లాలో రైతుల ఆందోళన


హరిశంకర్‌ రైల్వే స్టేషన్లో పట్టాలపై బైఠాయించిన రైతులు

కటక్‌, న్యూస్‌టుడే: బొలంగీర్‌ జిల్లాలో నష్టపోయిన రైతులకు వ్యవసాయ బీమా మొత్తాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పలు ప్రాంతాల్లో రైలురోకో నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బొలంగీర్‌ రైల్వే స్టేషన్‌, హరిశంకర్‌, టిట్లాగఢ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వందలాదిమంది రైతులు రైలు పట్టాలపై ధర్నా చేపట్టారు. వారిని అడ్డుకోవడంలో పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రైతులు రైలు పట్టాలపై కూర్చున్నారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనకారులు అందించిన వివరాల ప్రకారం... గత ఏడాది జిల్లాలో కరవు ఏర్పడి వందలాదిమంది రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. బీమా మొత్తాలు చెల్లించాలని, రైతులకు ఆదుకోవాలని చాలాసార్లు రైతులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. బీమా సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పంటనష్టంపై జిల్లా యంత్రాంగం తప్పుడు వివరాలు అందించిందని ఆరోపిస్తూ బీమా సంస్థ మొత్తాలు విడుదల చేయడం లేదు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బీమా మొత్తాలు ఇవ్వకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చించి పరిస్థితిని చక్కదిద్దారు. బొలంగీర్‌ జిల్లా రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని