logo

పెట్టుబడిదారులకు పూర్తి సౌకర్యాలు

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం పూర్తి సౌకర్యాలు కల్పిస్తుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. బెంగళూరులో బుధవారం

Published : 30 Sep 2022 03:48 IST

నిర్మాణాలకు ముందుకు రావాలని నవీన్‌ పిలుపు

వేదికపై సీఎం, మంత్రి ప్రతాప్‌, ఇతర అధికారులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం పూర్తి సౌకర్యాలు కల్పిస్తుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. బెంగళూరులో బుధవారం రాత్రి ఏర్పాటైన పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. భువనేశ్వర్‌లో ఏర్పాటైన ఇన్ఫోసిటీలో ఐటీ సంస్థలు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు చేస్తున్నాయని, నూతన విధానం అమలుతో నిర్మాణ సంస్థలకు రాయితీలు ఉన్నాయన్నారు. భారీ పరిశ్రమలకు స్థలాలు, మంచినీరు, విద్యుత్తుకు కొరత లేదన్నారు. ఉత్పత్తుల ఎగుమతులకు గోపాలపూర్‌, ధమ్రా, పరదీప్‌ ఓడరేవులు అనుకూలంగా ఉన్నాయని, రహదారులు, ఎయిర్‌ కనెక్టివిటీ సౌకర్యాలు ఉన్నాయని సీఎం వివరించారు. నిర్మాణ సంస్థలకు గనులను లీజుకు ఇస్తామన్నారు. 20 ప్రముఖ కంపెనీల యాజమాన్యాలతో నవీన్‌ ముఖాముఖి చర్చించారు. ఐబీఎం సంస్థ అధిపతి అమిత్‌ శర్మ అక్టోబరులో భువనేశ్వర్‌లో ఐటీ శాఖ ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్మాణ రంగంలో ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ జరిగింది. పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ, విద్యుత్తు శాఖల మంత్రి ప్రతాప్‌ దేవ్‌, ఆ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి హేమంత శర్మ, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయపాండ్యన్‌ మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని