logo

ఎమ్కేసీజీలో రూ.55 కోట్లతో ‘క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌’

స్థానిక ఎమ్కేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రిలో రూ.55 కోట్ల వ్యయంతో కొత్తగా ‘క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌’ నిర్మాణం కానుంది. ఎమ్కేసీజీ ఆవరణలోని మైదానం సమీపాన 14,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల

Published : 30 Sep 2022 03:48 IST

భవనం నమూనా

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక ఎమ్కేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రిలో రూ.55 కోట్ల వ్యయంతో కొత్తగా ‘క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌’ నిర్మాణం కానుంది. ఎమ్కేసీజీ ఆవరణలోని మైదానం సమీపాన 14,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మాణం పనులను కోల్‌కతాకు చెందిన ఓ గుత్త సంస్థ టెండరు దక్కించుకుంది. త్వరలోనే పనులు మొదలవుతాయని రోడ్లు, భవనాల శాఖ ఎమ్కేసీజీ జూనియరు ఇంజినీరు కుళమణి ఎక్కా బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ భవనంలో వంద పడకల ఇండోర్‌ వార్డు, ఔట్‌డోర్‌, రోగుల బంధువుల విశ్రాంతి గృహం, వైద్యులు, వైద్య విద్యార్థుల కోసం సమావేశ మందిరం, వాహనాల పార్కింగు ప్రాంతం తదితర సౌకర్యాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్కేసీజీ రేడియాలజీ విభాగం ఆధీనంలోని క్యాన్సర్‌ కేంద్రానికి దక్షిణ ఒడిశా జిల్లాల నుంచి ప్రతిరోజు ఇరవై మంది వరకూ రోగులు వస్తుంటారు. బాధితులు రోజుల తరబడి చికిత్సలు పొందుతుంటారు. ఈ భవనం పాతది కావడంతో చిన్న వార్డులో రోగులకు ప్రస్తుతం చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు క్యాన్సర్‌ వైద్య నిపుణులు, ఆధునిక సౌకర్యాల కొరత వెంటాడుతోంది. కొత్తగా క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణంతో ఆయా సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్న ఆశలు చిగురిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని