logo

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ల గడువు పెంపు

వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్లు ప్లేట్ల కోసం రవాణా శాఖ విధించిన గడువును మరో నెల రోజులు పొడిగించారు. వాహనాల చివరి నెంబర్లు 1, 2, 3, 4 ఉన్న వాహనదారులు సెప్టెంబరు 30లోగా నెంబర్‌ ప్లేట్లు మార్చుకోవాలని,

Published : 01 Oct 2022 01:48 IST

వాహనదారులకు ఊరట

కటక్‌ న్యూస్‌టుడే: వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్లు ప్లేట్ల కోసం రవాణా శాఖ విధించిన గడువును మరో నెల రోజులు పొడిగించారు. వాహనాల చివరి నెంబర్లు 1, 2, 3, 4 ఉన్న వాహనదారులు సెప్టెంబరు 30లోగా నెంబర్‌ ప్లేట్లు మార్చుకోవాలని, లేకుంటే అక్టోబరు 1 నుంచి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని ఇటీవల రవాణా శాఖ ప్రకటించింది. ఈ సౌకర్యం కల్పించేందుకు ఆ శాఖ వద్ద సౌకర్యాలు లేవు. దీంతో నెంబర్‌ ప్లేట్ల కోసం దరఖాస్తులు చేసిన వారికి నెలరోజుల అనంతరం జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవధి పెంచాలని కోరుతూ హైకోర్టులో వాహనాల యజమానులు కొందరు పిల్‌ దాఖలు చేశారు. దరఖాస్తు చేసినవారందరికీ నెంబరు ప్లేట్లు సమకూర్చే పరిస్థితి ఆ శాఖకు లేదని వ్యాజ్యం పేర్కొన్నారు. దీంతో సెప్టెంబరు 28న హైకోర్టు విచారణ జరిపి నెంబర్‌ ప్లేట్లు సమకూర్చేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాల వివరాలు కోర్టుకు తెలియజేయాలని కోరింది. ఈ కేసుపై శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది హాజరై వివరాలు కోర్టులో సమర్పిస్తూ గడువును అక్టోబరు 31 వరకు పెంచుతామని న్యాయమూర్తికి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించి వారి వాహనాలకు కొత్తవాటిని సమకూర్చాలని న్యాయస్థానం సూచించింది. గడువు పొడిగించినట్లు ప్రకటన విడుదల చేస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో అక్టోబరు 26వ తేదీనాటిని విచారణను వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని