logo

సినీ నిర్మాతపై అత్యాచారం కేసు

ఒడియా సినీ నిర్మాత అక్షయ పరిజపై అత్యాచారం కేసు నమోదైంది. బాధిత యువతి శుక్రవారం భువనేశ్వర్‌లోని లక్ష్మీసాగర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లో

Published : 01 Oct 2022 09:39 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఒడియా సినీ నిర్మాత అక్షయ పరిజపై అత్యాచారం కేసు నమోదైంది. బాధిత యువతి శుక్రవారం భువనేశ్వర్‌లోని లక్ష్మీసాగర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పి నిర్మాత అక్షయ్‌ పరిజ ఏడాది నుంచి తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆరోపించింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి బెదిరిస్తూ సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిపింది. కుటుంబ సభ్యులు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, వివాహం చేసుకుంటే మొత్తం కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. వదిలేయాలని బతిమాలినా వినకుండా హింసిస్తున్నాడని చెప్పింది. భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని కోరింది. ఆమె ఏడాదిపాటు ఎందుకు నోరు విప్పలేదు? ఇప్పుడెందుకు ఫిర్యాదు చేసిందన్నది తెలియలేదు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts