logo

మహాత్ముడు అమరజీవి: గవర్నర్‌ గణేశీలాల్‌

జాతిని జాగృతం చేయడానికే మహాత్ములు జన్మిస్తారని, వారికి మరణం లేదని గవర్నరు ఆచార్య గణేళీలాల్‌ చెప్పారు. గాంధీ జయంతి పురస్కరించుకుని ఆదివారం భువనేశ్వర్‌ అసెంబ్లీ భవనం ఆవరణలోని బాపూజీ విగ్రహం వద్ద సంస్మరణ కార్యక్రమం ఏర్పాటైంది, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, శాసన సభాపతి బిక్రం కేసరి అరుఖ్‌, మంత్రులు అతాను సవ్యసాచి నాయక్‌, టుకుని సాహు, రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Published : 03 Oct 2022 03:12 IST

మానవత్వానికి ప్రతీక బాపూజీ: నవీన్‌

కార్యక్రమంలో పాల్గొన్న గణేశీలాల్‌, నవీన్‌, సభాపతి, మంత్రులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: జాతిని జాగృతం చేయడానికే మహాత్ములు జన్మిస్తారని, వారికి మరణం లేదని గవర్నరు ఆచార్య గణేళీలాల్‌ చెప్పారు. గాంధీ జయంతి పురస్కరించుకుని ఆదివారం భువనేశ్వర్‌ అసెంబ్లీ భవనం ఆవరణలోని బాపూజీ విగ్రహం వద్ద సంస్మరణ కార్యక్రమం ఏర్పాటైంది, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, శాసన సభాపతి బిక్రం కేసరి అరుఖ్‌, మంత్రులు అతాను సవ్యసాచి నాయక్‌, టుకుని సాహు, రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నరు మాట్లాడుతూ... బాపూజీ ఆదర్శాలు, విలువల గురించి విపులంగా వివరించారు. అతిథిగా పాల్గొన్న నవీన్‌ మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయుల పాలన అంతం చేసిన గాంధీ యుగపురుషడని అన్నారు. జాతిపిత అడుగుజాడల్లో నడవాలని శాంతి, సమత, మమతలను పంచాలని, బడుగు బలహీన వర్గాలకు సేవలు చేయాలని యువతకు సందేశమిచ్చారు. ఈ సందర్భంగా సీఎం శాసన సభావరణలో గాంధీజీ పేరిట మొక్క నాటి నీరు పోశారు. స్వాతంత్య్ర సమరయోధుడు అశోక్‌ చంద్ర మహంతి ఆశీస్సులు అందుకున్నారు. ఈ వేడుకలో అసెంబ్లీ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని