logo

రెండు ఆవర్తనాలు.. రాష్ట్రంలో భారీ వర్షాలు

ఉత్తర తూర్పు బంగాళాఖాతం ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒడిశా తీరంలో ఆదివారం తుపాను ఆవర్తనం ఏర్పడినట్లు గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’ చెప్పారు. పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆంధ్రప్రదేశ్‌ తీరంలో మరో ఆవర్తనం కొనసాగుతోందన్నారు.

Published : 03 Oct 2022 03:12 IST

5 వరకు ఉంటాయన్న ఐఎండీ

భారీ వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాల వివరాలు.. మ్యాప్‌లో పసుపురంగులో

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఉత్తర తూర్పు బంగాళాఖాతం ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒడిశా తీరంలో ఆదివారం తుపాను ఆవర్తనం ఏర్పడినట్లు గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’ చెప్పారు. పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆంధ్రప్రదేశ్‌ తీరంలో మరో ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 5 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయన్నారు.

17 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
సోమవారం బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, కేంద్రపడ, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, గంజాం, గజపతి, సుందర్‌గఢ్‌, కేంఝర్‌, మయూర్‌భంజ్‌, దేవ్‌గఢ్‌, అనుగుల్‌, ఢెంకనాల్‌ జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వాన కురిసే సూచనలు ఉండడంతో ఈ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు చేశామన్నారు.

రవుర్కెలా ఇస్పాత్‌ కాలనీలో ఆదివారం సాయంత్రం కురుస్తున్న వాన

మంగళవారం భారీగా..
గంజాం, గజపతి, పూరీ, ఖుర్దా జిల్లాల్లో 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర అతిభారీ వర్షాలు మయూర్‌భంజ్‌, రాయగడ, మల్కాన్‌గిరి, కొరాపుట్‌, కొంధమాల్‌, కలహండి, నవరంగపూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, కటక్‌, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌, నయాగఢ్‌ జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్లకు అవకాశం ఉందని దాస్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని