logo

సరస్వతీ నమోస్తుతే!

గంజాం జిల్లాలోని శక్తిపీఠాలు, తాత్కాలిక దుర్గా మండపాల్లో ఆదివారం సప్తమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా తల్లిని సరస్వతీ దేవి అవతారంతో అలంకరించి, పూజలు జరిపారు.

Published : 03 Oct 2022 03:12 IST

పూజలందుకుంటున్న చౌడేశ్వరి తల్లి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలోని శక్తిపీఠాలు, తాత్కాలిక దుర్గా మండపాల్లో ఆదివారం సప్తమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా తల్లిని సరస్వతీ దేవి అవతారంతో అలంకరించి, పూజలు జరిపారు. స్థానిక మార్తాపేటలోని రామలింగ చౌడేశ్వరి అమ్మవారిని అలంకరించగా, స్థానిక ఖస్పావీధిలోని జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న చిన్నారులకు మహిళలు విద్య ఉపకరణాలు పంపిణీ చేశారు. అర్చకులు భాస్కరభట్ల బాలకృష్ణ శర్మ పూజలు జరిపించారు.


జగజ్జననికి జేజేలు

ప్రత్యేక అలంకరణలో మజ్జిగౌరి అమ్మవారు

రాయగడ, న్యూస్‌టుడే: ఉత్కళాంధ్రుల ఇలవేల్పుగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని స్వర్ణాభరణాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం ప్రాంగణాన్ని వివిధ పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రింగ్‌ రోడ్డు మా మంగళ ఆలయంలో శనివారం రాత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యోగిశ్రీ చైతన్య రాంజీ పర్యవేక్షణలో దీపార్చన నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని