logo

నవంబరు 3న ధాంనగర్‌ ఉప ఎన్నిక

ధాంనగర్‌ (భద్రక్‌ జిల్లా) అసెంబ్లీ ఉప ఎన్నిక భేరీ మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు షెడ్యూల్‌ ప్రకటించింది. ధాంనగర్‌ భాజపా ఎమ్మెల్యే బిష్ణుశెఠి మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

Published : 04 Oct 2022 02:02 IST

ఈ నెల 7 నుంచి 14 వరకు నామినేషన్లు

భద్రక్‌ జిల్లా మ్యాప్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ధాంనగర్‌ (భద్రక్‌ జిల్లా) అసెంబ్లీ ఉప ఎన్నిక భేరీ మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు షెడ్యూల్‌ ప్రకటించింది. ధాంనగర్‌ భాజపా ఎమ్మెల్యే బిష్ణుశెఠి మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. దసరా వేడుకలు ముగిసినంతనే ప్రధాన రాజకీయ పార్టీలు బిజద, భాజపా, కాంగ్రెస్‌లు రంగంలోకి దిగుతాయి. కోలాహలం ఊపందుకోనుంది. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

దివంగత ఎమ్మెల్యే బిష్ణుశెఠి (పాత చిత్రం)


భాజపా అధ్యక్షుని మంతనాలు

భాజపా ఖాతాలో ఉన్న ధాంనగర్‌ స్థానం నిలబెట్టుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. గత నెల 30న భాజపా కేంద్ర శాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ధాంనగర్‌ సందర్శించి శెఠి కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి విదితమే. ఇక్కడ ఏర్పాటైన సంతాప సభలో పాల్గొన్న నడ్డా తదుపరి అభ్యర్థి ఎవరన్న విషయం భద్రక్‌ జిల్లా నేతలతో చర్చించారు.


  నివేదిక అడిగిన నవీన్‌

గత సాధారణ ఎన్నికల తర్వాత 5 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాలను బిజద కైవసం చేసుకుంది. ధాంనగర్‌ స్థానాన్నీ గెలిచి ప్రతిష్ట పెంచుకోవాలన్న ధ్యేయంతో ఆ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక భద్రక్‌ జిల్లా నేతలతో ఈ విషయమై ఇదివరకే మాట్లాడారు. అర్హుల వివరాలపై నివేదిక అడిగినట్లు తెలిసింది.


కాంగ్రెస్‌కు సవాల్‌

ఇంటిపోరు, భేదాభిప్రాయాలతో సతమతమవుతూ వరుస పరాజయాలు చవిచూస్తున్న కాంగ్రెస్‌ ప్రతిష్టకు ధాంనగర్‌ ఉప ఎన్నిక సవాల్‌ కానుంది. మంచి అభ్యర్థిని నిలబెట్టి ఈ స్థానం తమ ఖాతాలో వేసుకుంటామని, త్వరలో అభ్యర్థి ఎంపిక జరుగుతుందని ఆ పార్టీ నేతలు  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని