logo

బహిర్భూమి రహిత గ్రామాల కేటగిరీలో ఒడిశాకు చోటు

స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ 2.0 కింద మన రాష్ట్రానికి తొమ్మిది అవార్డులు దక్కాయి. బహిర్భూమి రహిత గ్రామాల కేటగిరిలో ఒడిశా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం ఆదివారం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ సర్వే ఫలితాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Published : 04 Oct 2022 02:02 IST

నాలుగోస్థానం దక్కించుకున్న రాష్ట్రం

స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద తొమ్మిది అవార్డులు

రాయగడ సమితి మారుమూల గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ 2.0 కింద మన రాష్ట్రానికి తొమ్మిది అవార్డులు దక్కాయి. బహిర్భూమి రహిత గ్రామాల కేటగిరిలో ఒడిశా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం ఆదివారం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ సర్వే ఫలితాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వాటి ప్రకారం... ‘‘సుజలం’’ కింద నీటి సంరక్షణ చర్యలకు రెండు అవార్డులను దక్కించుకున్న రాష్ట్రం, స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ సర్వే కింద రెండు అవార్డులు, బహిర్భూమి రహిత అంశంపై అవగాహన కల్పనకు మరో ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.

23.9 శాతం గ్రామాలు..

స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 23.9 శాతం గ్రామాలు బహిర్భూమి రహితంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 46,785 గ్రామాలకు గానూ 11,203 గ్రామాల్లో ఓడీఎఫ్‌ ప్లస్‌ కేటగిరీని గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే జాజ్‌పూర్‌ ఈ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు సర్వే గణాంకాలు వెల్లడించాయి. సర్వేలో గ్రామాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఘన, ద్రవ, వ్యర్థాల నిర్వహణ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్రం తరఫున పంచాయతీరాజ్‌, తాగునీటి శాఖ కార్యదర్శి ఎస్‌.కె.లోహనీ ఇతర అధికారులు అవార్డులను స్వీకరించారు.

కాగితాలకే పరిమితం

అవార్డులు దక్కడం పట్ల ప్రతిపక్ష వర్గాలు విమర్శలు గుప్తిస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించినంత మాత్రన బహిర్భూమి రహిత గ్రామాలుగా ప్రకటించలేమని వాటి వినియోగం పట్ల ప్రజలను చైతన్య పరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో చాలా గ్రామాల్లో వినియోగించని, నిర్వహణ కొరవడిన, వేరే కార్యకలాపాలకు వినియోగిస్తున్న మరుగుదొడ్లు దర్శనమిస్తుండడం ఇందుకు నిదర్శనమని ఆరోపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు