logo

అందమైన ‘బొమ్మల కొలువు’ చూతము రారండి

దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా బ్రహ్మపురలో తెలుగు ప్రముఖులు డాక్టర్‌ జమ్ముల నారాయణరావు, శైలజ దంపతుల ఇంట్లో ఏర్పాటు చేసిన ‘బొమ్మల కొలువు’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Published : 04 Oct 2022 02:02 IST

కొలువుదీరిన వివిధ రకాల బొమ్మలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా బ్రహ్మపురలో తెలుగు ప్రముఖులు డాక్టర్‌ జమ్ముల నారాయణరావు, శైలజ దంపతుల ఇంట్లో ఏర్పాటు చేసిన ‘బొమ్మల కొలువు’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్థానిక చిన్నబజారు ప్రాంతంలోని వారి ఇంట్లో 600లకుపైగా వివిధ రకాల బొమ్మలతో ఏర్పాటు చేసిన ఇది సందర్శకులను ఆకట్టుకుంటోంది. సోమవారం కొలువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళల సామూహిక పారాయణాలు, భక్తిగీతాలాపనలు, పండగలపై క్విజ్‌ పోటీలు, సరదా ఆటలు తదితరాలు నిర్వహించారు. జమ్ముల శైలజ వీటిని పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని