logo

జగన్నాథుని సన్నిధిలో ధర్మేంద్ర పూజలు

దసరా సెలవుల నేపథ్యంలో పూరీ శ్రీక్షేత్రం అసంఖ్యాక భక్తులతో కిటకిటలాడుతోంది. మంగళవారం వర్షాలు కురుస్తున్నా సందర్శకులు జగన్నాథ దర్శనానికి బారులు దీరారు.

Published : 05 Oct 2022 02:29 IST

అరుణ స్తంభం వద్ద ప్రార్థిస్తున్న కేంద్ర మంత్రి

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: దసరా సెలవుల నేపథ్యంలో పూరీ శ్రీక్షేత్రం అసంఖ్యాక భక్తులతో కిటకిటలాడుతోంది. మంగళవారం వర్షాలు కురుస్తున్నా సందర్శకులు జగన్నాథ దర్శనానికి బారులు దీరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉదయం పురుషోత్తమ సన్నిధికి చేరుకుని స్వామికి పూజలు చేశారు. మహాలక్ష్మి, విమల ఆలయాల్లో దీపారాధన చేసిన ఆయన అరుణ స్తంభం వద్ద పూజలు నిర్వహించారు. జగన్నాథుడు, విమలమ్మ దేశ ప్రజలకు శుభాలు కలిగించాలని ప్రార్థనలు చేసినట్లు ధర్మేంద్ర విలేకరులకు చెప్పారు. విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం సందర్శకుల రద్దీ ఇంకా పెరిగే సూచనలు ఉన్నందున శ్రీక్షేత్రం లోపల, వెలుపల పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని