logo

అగ్నిప్రమాదంలో ఒరిజినల్‌ సర్టిఫికేట్లు దగ్ధం

ఇంట్లో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విలువైన సామగ్రి, నగదుతోపాటు విద్యార్థి ధ్రువపత్రాలు దగ్ధమైన ఘటన మట్టంపుట్‌లో చోటు చేసుకుంది.

Published : 05 Oct 2022 02:29 IST

కాలి బూడిదైన సామగ్రి

మాచ్‌ఖండ్‌, న్యూస్‌టుడే: ఇంట్లో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విలువైన సామగ్రి, నగదుతోపాటు విద్యార్థి ధ్రువపత్రాలు దగ్ధమైన ఘటన మట్టంపుట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లమతాపుట్‌ సమితి గున్నయిపడా పంచాయతీ పరిధిలోని మట్టంపుట్‌ గ్రామానికి చెందిన సొదపంగి చిరు వ్యాపారి. సోమవారం సాయంత్రం ఆయన ఇంట్లో విద్యుత్తుషార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.  సొదపంగి, ఆయన భార్య మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో దుకాణంలో సామగ్రితోపాటు రూ.40 వేల నగదు, వారి కుమార్తె సునీత పంగి మెట్రిక్‌, ఇంటర్‌, డిగ్రీ ఒరిజినల్‌ ధ్రువపత్రాలు కాలిపోయాయి. లమతాపుట్‌ అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని