logo

వంతెన లేదు... వేదనకు అంతం లేదు

ఏవోబీలోని మావోయిస్టు ప్రాంతమైన నారాయణ పట్టణం సమితిలో కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నా.. రవాణా సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్నాయి.

Published : 05 Oct 2022 02:29 IST

వృద్ధురాలిని గెడ్డ దాటిస్తూ..

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఏవోబీలోని మావోయిస్టు ప్రాంతమైన నారాయణ పట్టణం సమితిలో కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నా.. రవాణా సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్నాయి. వంతెన లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. బైరాగి కిలిమిసి-సండివలస గ్రామాల మధ్యలో ఉన్న గెడ్డపై వంతెన 2013లో నిర్మించారు. 2014లో భారీ వర్షాలకు ఈ వంతెన ధ్వంసమైంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం కిలిమిసి గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను మోసుకుంటూ గెడ్డ దాటించి అక్కడ నుంచి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వంతెన నిర్మాణంలో జాప్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆ ప్రాంతీయులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు