logo

నదిలో దిగి.. స్ట్రెచర్‌పై తరలింపు

అస్వస్థతకు గురైన వ్యక్తిని స్ట్రెచర్‌పై నదిలో దిగి మోసుకుంటూ తీసుకెళ్లిన హృదయవిదారకర ఘటన కొరాపుట్‌ జిల్లా నారాయణపట్నం సమితి ఖారికానలో జరిగింది.

Published : 05 Oct 2022 02:29 IST

నదిలో స్ట్రెచర్‌పై రామ్‌ను మోసుకెళ్తూ...

జయపురం, న్యూస్‌టుడే: అస్వస్థతకు గురైన వ్యక్తిని స్ట్రెచర్‌పై నదిలో దిగి మోసుకుంటూ తీసుకెళ్లిన హృదయవిదారకర ఘటన కొరాపుట్‌ జిల్లా నారాయణపట్నం సమితి ఖారికానలో జరిగింది. రామ్‌ సుంకియా(45) సోమవారం రాత్రి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. వారి గ్రామాలు జంఝావతి నదికి అవతల ఉండడం, రాకపోకలకు వంతెన లేకపోవడంతో ఇతడిని తీసుకెళ్లేందుకు మంగళవారం వచ్చిన అంబులెన్స్‌ 3 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో సర్పంచి, అంబులెన్స్‌ సిబ్బంది సహాయంతో గ్రామస్థులు రోగిని స్ట్రెచర్‌పై నదిలో దిగి మోసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌లో నారాయణపట్నం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సర్పంచి రేబతి మాట్లాడుతూ... నదికి అవతల వైపు ఐదు గ్రామాలు ఉన్నాయని, వందల కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. వంతెన నిర్మించాలని జిల్లా యంత్రాంగానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు