logo

ముగిసిన మూడోవిడత సోలాపురి అమ్మవారి సంబరాలు

కటక్‌లో చివరి, మూడోవిడత సోలాపురి అమ్మవారి సంబరాలు మంగళవారంతో ముగిశాయి. ఏడు తెలుగు వీధుల్లో మూడోవిడత సంబరాలు నిర్వహించుకున్నారు.

Published : 05 Oct 2022 02:29 IST

అఖద గల్లీలో సోలాపురి అమ్మవారి ఘటం

కటక్‌, న్యూస్‌టుడే: కటక్‌లో చివరి, మూడోవిడత సోలాపురి అమ్మవారి సంబరాలు మంగళవారంతో ముగిశాయి. ఏడు తెలుగు వీధుల్లో మూడోవిడత సంబరాలు నిర్వహించుకున్నారు. ఆదివారం నదీ తీరాల్లో ఘటాలు ఏర్పాటు చేసి వీధుల్లోని మండపాల వద్దకు తీసుకొచ్చారు. సోమ, మంగళ రెండు రోజులు పూజలు నిర్వహించి మంగళవారం అమ్మవారి ఘటాన్ని సాగనంపారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపులు కూడా నిర్వహించారు. సోమవారం రాత్రి మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అఖద గల్లి మండపం వద్ద అమ్మవారి ఘటానికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. రాష్ట్రంలో పేరొందిన గాయకులు హాజరై భక్తి గీతాలు ఆలపించారు. కటక్‌ సోలాపురి అమ్మవారి కమిటీ ప్రతినిధులు, ఐక్యత సంఘం ప్రతినిధులు, వివిధ పూజా కమిటీల ప్రతినిధులను వారిని సత్కరించారు. గోదాం గల్లి, బారపత్రసాహి, హరిపూర్‌ రోడ్డు, ఛత్ర బజార్‌, సెమినార్‌ స్కూల్‌ తెలుగు వీధుల్లో సంబరాలు నిర్వహించారు.

భక్తి గీతాలు ఆలపిస్తున్న గాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు