logo

రేపటి వరకు రాష్ట్రంలో వర్షాలు: ఐఎండీ

అల్పపీడనం వల్ల కురిసిన వర్షాలు దసరా సంబరాలపై ప్రభావం చూపాయి.

Published : 05 Oct 2022 02:29 IST

బుధవారం వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాల వివరాలు మ్యాప్‌లో పసుపురంగులో (ఐఎండీ విడుదల చేసిన చిత్రం)

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: అల్పపీడనం వల్ల కురిసిన వర్షాలు దసరా సంబరాలపై ప్రభావం చూపాయి. పశ్చిమ కేంద్ర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా జిల్లాల్లో ప్రభావం చూపిందని, ఒక మోస్తరు ఉంచి భారీ వర్షాలు కురిసినట్లు గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. అల్పపీడనం ఆంధ్రప్రదేశ్‌ తీరానికి తరలిందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం (సైక్లోనిక్‌ సర్క్యులేషన్‌) కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ రెండింటి ప్రభావం రాష్ట్రంపై మరో 48 గంటల వరకు ఉంటుందన్నారు. మంగళవారం పూరీ జిల్లా కాకట్‌పూర్‌లో 160 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసిందని, మిగతా కేంద్రాల్లో 100 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

నేడు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
బుధవారం మల్కాన్‌గిరి, కొరాపుట్‌, రాయగడ, నవరంగ్‌పూర్‌, గజపతి, గంజాం, పూరీ, ఖుర్దా, జగత్సింగ్‌పూర్‌, కేంద్రపడ, బాలేశ్వర్‌, భద్రక్‌ జిల్లాలో 7 నుంచి 11 సెంటీమీటర్ల వాన కురిసే సూచనలు ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు చేసినట్లు తెలిపారు.

రేపు దక్షిణ జిల్లాల్లో
గురువారం గజపతి, గంజాం, మల్కాన్‌గిరి, కొరాపుట్‌, నవరంగపూర్‌, రాయగడ, పూరీ జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 7 జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు చేశామన్నారు. శుక్రవారం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని దాస్‌ చెప్పారు.

మంగళవారం ఉదయం పూరీలోని బొడొదండోలో వాన నీరు

జన జీవనం అస్తవ్యస్తం
మంగళవారం ఉదయం నుంచి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఆగాగి కురిసిన వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేశాయి. మార్కెట్లలో దసరా కొనుగోళ్లు తగ్గాయి. గ్రామాల నుంచి ప్రజలు సమీప పట్టణాలకు వెళ్లలేకపోయారు. బుధవారం విజయ దశమి వేడుకలకు వర్షాలు ఆటంకం కలిగిస్తాయని ఐఎండీ స్పష్టం చేయడంతో వ్యాపారులు ఉసూరుమంటున్నారు.

 

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని