logo

‘దసరా’కు వరుణుడి దెబ్బ

‘దసరా’ వ్యాపారంపై అన్నివర్గాల వ్యాపారులు బోలెడు ఆశలు పెంచుకున్నారు. భారీగా వ్యాపారం సాగుతుందని ఆశించిన వారిని మంగళవారం ఉదయం నుంచి ఆగాగి కురుస్తున్న వర్షాలు నిరాశపరిచాయి.

Published : 05 Oct 2022 02:29 IST

అన్నపూర్ణ బజారు కూడలిలో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఇలా..

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘దసరా’ వ్యాపారంపై అన్నివర్గాల వ్యాపారులు బోలెడు ఆశలు పెంచుకున్నారు. భారీగా వ్యాపారం సాగుతుందని ఆశించిన వారిని మంగళవారం ఉదయం నుంచి ఆగాగి కురుస్తున్న వర్షాలు నిరాశపరిచాయి. దక్షిణ ఒడిశాలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన బ్రహ్మపురలో కొనుగోలుదారులతో కిటకిటలాడాల్సిన బజార్లు బోసిపోయాయి. ముఖ్యంగా రహదారుల పక్కన వివిధ సామగ్రి విక్రయాలతో వందలాది మంది చిరు వ్యాపారులు ఉపాధి పొందుతుంటారు. వర్షాలకు వారిలో నిరుత్సాహం ఆవహించింది. నగరంలోని అర్బన్‌ బ్యాంకు రోడ్డు, అన్నపూర్ణ బజారు కూడలి, ఫైర్‌ స్టేషన్‌ రోడ్డు తదితర బజార్లు సాయంత్రం కొనుగోలుదారులు లేక కళతప్పాయి. సాధారణంగా ఆయా బజార్లలో పండగ రోజుల్లో ప్రజలతో సందడిగా కనిపిస్తుంది. వర్షానికి రహదారులన్నీ జలమయం కావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు వెనుకాడుతున్నారు. కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో కొంతసేపు వర్షం నీరు నిలిచిపోయింది. వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని