logo

నేడు సోమనాథ వ్రతాలు

జగన్నాథ సంస్కృతికి నిలయమైన ఉత్కళవాసులు వైష్ణు, శైవ, శాక్తేయ పూజలు, అన్ని వ్రతాలు నిర్వహిస్తారు.

Published : 05 Oct 2022 02:29 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: జగన్నాథ సంస్కృతికి నిలయమైన ఉత్కళవాసులు వైష్ణు, శైవ, శాక్తేయ పూజలు, అన్ని వ్రతాలు నిర్వహిస్తారు. 12 నెలల్లో 13 పండుగలు (బారో మాసో- తేరో జతొ)గా వినుతికెక్కిన ఒడిశాలో విజయ దశమినాడు ఆయుధ పూజలు నిర్వహిస్తారు. మహిళలు కఠోర ఉపవాసం చేసి రాత్రి శివపార్వతుల సోమనాథ వ్రతం చేపడతారు. విజయదశమి రోజున ఈ పూజలు చేస్తే కుటుంబాల్లో శుభాలు చేకూరతాయన్న నమ్మకం ఉంది. బుధవారం దసరా వేడుకల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. మరికొన్నిచోట్ల రావణ దహనం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు