logo

సర్పాల కోసం స్వగృహాన్ని వీడారు

పాము ఇంట్లో కనిపిస్తే బెంబేలెత్తిపోతాం. దానిని బయటకు పంపించేందుకు శతవిధాల ప్రయత్నిస్తాం. కానీ ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో ఒక ఇంట్లో పాములు కనిపించడంతో ఆ ఇంటి యజమాని వాటి కోసం ఏకంగా ఇంటినే వదిలి వేరొక చోట నివసిస్తున్న ఘటన చర్చనీయాంశమైంది.

Published : 07 Oct 2022 04:32 IST

ఇంట్లో ఏర్పడిన పాము పుట్ట

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: పాము ఇంట్లో కనిపిస్తే బెంబేలెత్తిపోతాం. దానిని బయటకు పంపించేందుకు శతవిధాల ప్రయత్నిస్తాం. కానీ ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో ఒక ఇంట్లో పాములు కనిపించడంతో ఆ ఇంటి యజమాని వాటి కోసం ఏకంగా ఇంటినే వదిలి వేరొక చోట నివసిస్తున్న ఘటన చర్చనీయాంశమైంది. మల్కాన్‌గిరి సమితి గంగలా పంచాయతీ నిలిమరి గ్రామానికి చెందిన నీలకంఠ భూమియా ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం చెదలు పెట్టిన పుట్టలో రెండు నాగు పాములు కనిపించాయి. భూమియా వాటిని తరిమేయకుండా రోజూ పూజలు చేయడం ప్రారంభించాడు. అలవాటు పడిన సర్పాలు ఆ ఇంటిని నివాసంగా మార్చుకున్నాయి. దీంతో భూమియా, అతడి భార్య ఆ ఇంటిని వాటి కోసం వదిలి ఎదురింట్లోకి మకాం మార్చాగా, వీరి కుమార్తె ఆ ఇంట్లోనే వేరొక గదిలో ఉంటోంది. తమ కుమార్తెతో సర్పాలకు చనువు ఎక్కువని ఆమె పాలు పెడితేనే తాగుతాయని, అదే ఇంట్లో కుమార్తె ఉంటున్నా.. ఏ హాని చేయలేదని భూమియా తెలిపారు. రెండు పాములతో అనుబంధం ఏర్పడడంతో భూమియా కుమార్తె వివాహం అయినప్పటికీ అక్కడే ఉంటోంది. పాములు ఉంటున్న గదిని మందిరంలా తయారుచేసి రోజూ పూజలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని