logo

సముద్రంలో ఉండగా పడవలో మంటలు.. బతికి బయటపడిన మత్స్యకారులు

బాలేశ్వర్‌ జిల్లాలో సముద్రం మధ్యలో ఉన్న అబ్దుల్‌ కలాం ద్వీపం ప్రాంతంలో గురువారం ఉదయం మత్స్యకారుల పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పదిమంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై లభించిన వివరాల ప్రకారం...

Updated : 07 Oct 2022 07:07 IST

సముద్రం మధ్యలో మంటల్లో పడవ

కటక్‌ న్యూస్‌టుడే: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో సముద్రం మధ్యలో ఉన్న అబ్దుల్‌ కలాం ద్వీపం ప్రాంతంలో గురువారం ఉదయం మత్స్యకారుల పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పదిమంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై లభించిన వివరాల ప్రకారం... భద్రక్‌ జిల్లా ధమర సమితి దోసింగా గ్రామానికి చెందిన పదిమంది మత్స్యకారులు గురువారం ఉదయం చేపల వేటకు సముద్రంపైకి వెళ్లారు. అబ్దుల్‌ కలాం దీపం వద్ద వారున్న పడవలో మంటలు పుట్టాయి. దీంతో వారంతా కోస్టల్‌ గార్డులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని మత్స్యకారులను ఆదుకున్నారు. ఇంతలో పడవ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి కారణాలు వెలుగులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని