logo

శ్రీక్షేత్రం ప్రపంచ విశ్వ విద్యాలయం: ధర్మేంద్ర

పూరీ శ్రీక్షేత్రం ప్రపంచ విశ్వ విద్యాలయమని, భిన్న సంస్కృతుల మేలి కలయిక ఇదని, జగన్నాథుడు విశ్వ గురువని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. విజయద దశమి పర్వదినాన పూరీ సంస్కృత విశ్వ విద్యాలయంలో సదాశివ క్యాంపస్‌ భవనాన్ని శుభారంభం చేసిన కేంద్రమంత్రి ఆచార్యులు, విద్యార్థులతో మాట్లాడారు.

Published : 07 Oct 2022 04:32 IST

ప్రసంగిస్తున్న ధర్మేంద్ర

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రం ప్రపంచ విశ్వ విద్యాలయమని, భిన్న సంస్కృతుల మేలి కలయిక ఇదని, జగన్నాథుడు విశ్వ గురువని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. విజయద దశమి పర్వదినాన పూరీ సంస్కృత విశ్వ విద్యాలయంలో సదాశివ క్యాంపస్‌ భవనాన్ని శుభారంభం చేసిన కేంద్రమంత్రి ఆచార్యులు, విద్యార్థులతో మాట్లాడారు. పురుషోత్తమతత్వం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోందని, వసుదైక కుటుంబం పరమార్థాన్ని బోధించి కలిసి ఉండాలన్న సందేశమిస్తోందని చెప్పారు. పూరీ సంస్కృత విశ్వ విద్యాలయం ఎంతోమందిని ప్రతిభావంతులుగా తీర్చి దిద్దిందని, వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని బోధిస్తున్న ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో మరింతమందికి జ్ఞానం అందిస్తుందని పేర్కొన్నారు. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య రవీంద్రకుమార్‌ పండా, ఇతర ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పాల్గొన్న ఆచార్యులు, విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని