రైతుల ప్రయోజనాలపై కేంద్రానికి చిత్తశుద్ధి కరవు
రైతులపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం లేదని కాంగ్రెస్ సభాపక్షం నేత (సీఎల్పీ) నర్సింగ మిశ్ర పేర్కొన్నారు.
శాసనసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానంపై చర్చ
శనివారం కొలువుదీరిన శాసనసభ
భువనేశ్వర్, న్యూస్‌టుడే: రైతులపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం లేదని కాంగ్రెస్ సభాపక్షం నేత (సీఎల్పీ) నర్సింగ మిశ్ర పేర్కొన్నారు. ‘అన్నదాతలు, ప్రయోజనాలు’ అన్న అంశంపై కాంగ్రెస్ శనివారం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై సభాపతి మధ్యాహ్నం చర్చకు అనుమతించారు. సీఎల్పీ నేత మిశ్ర మాట్లాడుతూ.. ధాన్యం క్వింటాలుకు రూ.2,930లు మద్దతు ధర ఇవ్వాలని అయిదేళ్ల క్రితం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా పట్టించుకోలేదన్నారు. రైతుల ఇబ్బందులు ప్రధానికి వివరించడానికి ఏర్పాటైన సభాసంఘంతో భేటీకి నరేంద్ర మోదీ సమయం కేటాయించలేదని గుర్తుచేశారు. పీఎం ఫసల్ బీమా చెల్లింపులు, ఎరువుల పంపిణీలోనూ రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్నారు. రైతుల పక్షాన ఉన్నామని మొసలి కన్నీరు కారుస్తున్న భాజపా నాయకులు వారి ఇబ్బందులపై సభాపతికి ఎందుకు వాయిదా తీర్మానం అందజేయలేదని మిశ్ర ప్రశ్నించారు. పాలకపక్షం బిజద దిల్లీ పాలకులతో లోపాయికారీ సంబంధం ఏర్పాటు చేసుకోవడంతో కేంద్రాన్ని నిలదీయలేకపోతోందన్నారు.
ఇది రాష్ట్ర వైఫల్యం
భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్ మాఝి మాట్లాడుతూ... కేంద్రం కేటాయిస్తున్న నిధులను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోందన్నారు. పంటల బీమా లబ్ధిదారుల వివరాలు సకాలంలో పంపించలేకపోయిన ప్రభుత్వం గతేడాది నష్టపోయిన అన్నదాతలకు ఇంతవరకు పెట్టుబడి రాయితీ (ఇన్‌ఫుట్ సబ్సిడీ) చెల్లించలేదన్నారు. పద్మపూర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేటాయించిన రూ.200 కోట్లు ఎవరికి చెల్లిస్తారన్న దానిపై స్పష్టత లేదని, అర్హుల వివరాలు లేవని సభ దృష్టికి తీసుకొచ్చారు. చేతకాని రాష్ట్ర పాలకులు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని, వారికి కాంగ్రెస్ నేతలు వంత పాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రైతుల పక్షానే ప్రభుత్వం
వ్యవసాయశాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ గైర్హాజరులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ప్రదీప్ అమత్ సమాధానమిచ్చారు. ప్రభుత్వం అన్నదాతల పక్షాన ఉందని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి, ఎంఎస్పీ పెంచాలని కేంద్రానికి పలుమార్లు సీఎం నవీన్ పట్నాయక్ దిల్లీ పెద్దలకు లేఖలు రాసిన సంగతిని గుర్తుచేశారు. విపత్తుల సమయాల్లో ప్రభుత్వం రైతులకు సాయం చేస్తోందన్నారు. తమ చిత్తశుద్ధి గురించి విపక్షాలు ధ్రువపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని, అన్నదాతలకిది తెలుసన్నారు.
భాజపా సభ్యుల బైఠాయింపు
మంత్రి ప్రదీప్ మాట్లాడుతున్న సమయంలో భాజపా సభ్యులు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయ మంత్రి రాణేంద్ర బదులుగా పంచాయతీ రాజ్ మంత్రి సమాధానమివ్వడం ఏమిటని నినాదాలు చేశారు. వారిని సభాపతి అరుఖ్ శాంతింపజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
KK pathak: నోరు పారేసుకున్న సీనియర్ ఐఏఎస్.. సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్
-
Movies News
Kasinathuni Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
India News
Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!