logo

విజిలెన్స్‌ వలలో రెవెన్యూ అధికారి

కొరాపుట్‌ జిల్లా సుక్కు తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అదనవు రెవెన్యూ అధికారి (ఏఆర్‌ఐ) అమిత్‌కుమార్‌ బెహరా శనివారం జయపురం విజిలెన్సు అధికారుల వలకు చిక్కారు.

Published : 27 Nov 2022 02:41 IST

అమిత్‌కుమార్‌ బెహరా

సిమిలిగుడ, కొరాపుట్‌, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా సుక్కు తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అదనవు రెవెన్యూ అధికారి (ఏఆర్‌ఐ) అమిత్‌కుమార్‌ బెహరా శనివారం జయపురం విజిలెన్సు అధికారుల వలకు చిక్కారు. విజిలెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుక్కు పంచాయతీకి చెందిన నంద ఖొరా భూమి పట్టాలో పేరు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏఆర్‌ఐ రూ.20 వేల లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడు రూ.10 వేలు ఇచ్చినా మిగిలిన డబ్బు కోసం హింసిస్తుండటంతో విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని, జయపురం బస్టాండ్‌ వద్దకు రావాలని నంద ఏఆర్‌ఐకి తెలిపారు. కారులో స్నేహితులతో కలసి అక్కడకు వచ్చిన బెహరాకు అధికారులు ఇచ్చిన రూ.6 వేలను బాధితుడు అందజేస్తుండగా విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారులను చూసిన అమిత్‌ ఆ డబ్బును పక్కనే ఉన్న స్నేహితుడికి ఇచ్చేయగా గమనించిన అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న అందరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఏఆర్‌ఐని అరెస్ట్‌ చేసి, కోర్టుకు తరలించారు. కొరాపుట్‌ కొలాబ్‌ నగర్‌లోని అమిత్‌కుమార్‌ నివాసం, సుక్కు తహసీల్దార్‌ కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని