logo

2.7 లక్షల ఇళ్లకు కరెంటు లేదు

రాష్ట్రంలోని 2,78,778 ఇళ్లకు విద్యుత్తు సౌకర్యం లేదని, కొరాపుట్‌ జిల్లాలోని 143 గ్రామాలకు చెందిన 4,727 ఇళ్లు ఈ జాబితాలో ఉన్నాయని విద్యుత్తు, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి ప్రతాప్‌దేవ్‌ తెలిపారు.

Published : 28 Nov 2022 01:21 IST

ప్రతాప్‌ దేవ్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 2,78,778 ఇళ్లకు విద్యుత్తు సౌకర్యం లేదని, కొరాపుట్‌ జిల్లాలోని 143 గ్రామాలకు చెందిన 4,727 ఇళ్లు ఈ జాబితాలో ఉన్నాయని విద్యుత్తు, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి ప్రతాప్‌దేవ్‌ తెలిపారు. జయపురం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినీపతి శనివారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రతాప్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. విద్యుత్తు కనెక్షన్లు లేని కుటుంబాలకు బిజుగ్రామజ్యోతి పథకం ద్వారా 2023 జూన్‌లోగా విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కొండకోనలు, మారుమూల గ్రామాలకు విద్యుత్తు సరఫరా సాధ్యం కావడం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సౌరశక్తి ఆధారిత వెలుగుల కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని