logo

హాకీ వరల్డ్‌ కప్‌ నిర్వహణకు రూ. 1,098 కోట్లు

హాకీ వరల్డ్‌ కప్‌-2023 నిర్వహణ రాష్ట్రానికి గౌరవమని, ఇందుకోసం ప్రభుత్వం రూ.1,098 కోట్లు కేటాయించినట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి తుషారకాంతి బెహర వివరించారు.

Published : 29 Nov 2022 02:38 IST

రవుర్కెల క్రీడా మైదానం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: హాకీ వరల్డ్‌ కప్‌-2023 నిర్వహణ రాష్ట్రానికి గౌరవమని, ఇందుకోసం ప్రభుత్వం రూ.1,098 కోట్లు కేటాయించినట్లు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి తుషారకాంతి బెహర వివరించారు. సోమవారం శాసనసభలో భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 2018లో తొలిసారిగా హాకీ వరల్డ్‌కప్‌ స్పాన్సర్‌ చేసిన ప్రభుత్వం రూ.67 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రవుర్కెల, భువనేశ్వర్‌లలో ఈసారి పోటీలు నిర్వహించాలని నిర్ణయించి, రవుర్కెలలోని బిర్సాముండ స్టేడియం విస్తరణ, ఆధునికీకరణ పనులు చేపట్టామన్నారు. భువనేశ్వర్‌ కళింగ క్రీడామైదానంలో మరిన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ నిర్మాణాలకు రూ.1023 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రవుర్కెల స్టేడియంలో భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం తరహాలో అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్న మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు