logo

అర్చననాగ్‌ దంపతులపై రెండు కేసులు

ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు నేరం చేసినా శిక్ష తప్పదని హోంశాఖ సహాయమంత్రి తుషారకాంతి బెహర చెప్పారు. బ్లాక్‌మెయిలర్‌ అర్చన నాగ్‌ వ్యవహారంపై సోమవారం మధ్యాహ్నం శాసనసభలో విపక్షం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

Published : 29 Nov 2022 02:38 IST

శానససభలో మంత్రి బెహర్చ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు నేరం చేసినా శిక్ష తప్పదని హోంశాఖ సహాయమంత్రి తుషారకాంతి బెహర చెప్పారు. బ్లాక్‌మెయిలర్‌ అర్చన నాగ్‌ వ్యవహారంపై సోమవారం మధ్యాహ్నం శాసనసభలో విపక్షం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి మాట్లాడుతూ.. ఆమె 64 మంది నేతలు, ప్రముఖులను వలలో వేసుకుని రూ.కోట్లు కూడగట్టిందని ఆరోపించారు. వీరిలో అధికార పార్టీ పెద్దలు ఉన్నారని, అందువల్లే ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని, ఈ కేసు పరిశోధనలో పోలీసులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. పలువురు భాజపా, కాంగ్రెస్‌ సభ్యులు ఈ విషయమై మాట్లాడారు. శాంతిభద్రతలు, సైబర్‌ నేరాల నియంత్రణలో హోంశాఖ విఫలమైందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు తప్పించుకుంటున్నారని, పోలీసుశాఖ పాలకుల కనుసన్నలలో నడుస్తోందని ఆరోపించారు. దీనిపై సమాధానమిచ్చిన మంత్రి బెహర మాట్లాడుతూ పోలీసుశాఖ పనితీరు బాగుందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు అర్చననాగ్‌ దంపతులను పోలీసులు అరెస్టు చేసి రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. మరోవైపు ఈడీ కూడా ఈ కేసు విచారిస్తోందని, విపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెహర సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని