logo

వ్యర్థాల కళాకృతికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

‘సాత్త్విక్‌ సోల్‌ ఫౌండేషన్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కళ్లికోట యూనిటరీ విశ్వవిద్యాలయం ఆవరణలోని గోడపై వ్యర్థాలతో ‘వింగ్స్‌ ఫర్‌ ది ఛేంజ్‌’ పేరిట అలంకరించిన కళాకృతి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది

Published : 29 Nov 2022 02:38 IST

రికార్డులో స్థానం సంపాదించిన కళాకృతి వద్ద ధ్రువపత్రం ప్రదర్శిస్తున్న ఉపకులపతి ఆచార్య మహంతి. చిత్రంలో భరత్‌ గౌరవ దాస్‌, ఇతర ప్రతినిధులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘సాత్త్విక్‌ సోల్‌ ఫౌండేషన్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కళ్లికోట యూనిటరీ విశ్వవిద్యాలయం ఆవరణలోని గోడపై వ్యర్థాలతో ‘వింగ్స్‌ ఫర్‌ ది ఛేంజ్‌’ పేరిట అలంకరించిన కళాకృతి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. సోమవారం మధ్యాహ్నం వర్సిటీ ఆవరణలో ఉపకులపతి ఆచార్య ప్రఫుల్ల కుమార్‌ మహంతి, ఫౌండేషన్‌ గంజాం జిల్లా సమన్వయకర్త భరత్‌ గౌరవ్‌ దాస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఎనిమిది అడుగుల ఎత్తు, అంతే వెడల్పున అయిదు వేల ప్లాస్టిక్‌ సీసాల మూతలతో ఈ కళాకృతిని రూపొందించామని చెప్పారు. వ్యర్థాల సద్వినియోగంపై ప్రజల్లో చైతన్యానికి దీన్ని రూపొందించామన్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రయుక్తా మహాపాత్ర్‌, జాస్మిన్‌ నిషా, శిబానీ పాఢి, ఆత్రాహి సాస్మల్‌, సోనాలి గమాంగ్‌, సుచిత్రా పాయక, కొయినా బెహర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని