logo

బీడీ కార్మికులకు నవీన్‌ నజరాన

పేదల ఆనందమే తన ఆనందమని, వారు ఆర్థికంగా, సామాజికంగా ముందంజ వేయాలన్న ధ్యేయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు.

Published : 29 Nov 2022 02:38 IST

కార్యక్రమంలో నవీన్‌, ఇతర అధికారులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పేదల ఆనందమే తన ఆనందమని, వారు ఆర్థికంగా, సామాజికంగా ముందంజ వేయాలన్న ధ్యేయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. ఆదివారం రాత్రి భువనేశ్వర్‌ లోక్‌సేవా భవన్‌ వేదికగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాటైన కార్యక్రమంలో బీడీ కార్మికుల బ్యాంకు ఖాతాలకు రూ.43 కోట్లు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ ఆకుల సేకరణలో గిరిజన మహిళలు ఎక్కువగా ఉన్నారని, దీనిపై కేంద్రం 18 శాతం జీఎస్టీ వసూలు చేయడం తగదని, దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి లేఖ రాశామన్నారు. బీడీ ఆకులు సేకరిస్తున్నవారికి రూ.వెయ్యి, ప్యాకింగ్‌, రవాణా చేస్తున్న కార్మికులకు రూ.1500 చొప్పున విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ప్రదీప్‌ అమిత్‌ మాట్లాడుతూ.. నువాపడ, కలహండి, కొరాపుట్‌, నవరంగపూర్‌, అనుగుల్‌, సంబల్‌పూర్‌, ఝార్సుగుడ, కొంధమాల్‌, బౌద్ధ్‌, కేంఝర్‌, దేవ్‌గఢ్‌, బొలంగీర్‌, బరగఢ్‌ జిల్లాలోని 8 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌ మహాపాత్ర్‌, అభివృద్ధి కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ జెనా, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని